30, సెప్టెంబర్ 2012, ఆదివారం

నేటి నుంచి జివవైవిద్య సదస్సు

హైదరాబాద్, న్యూస్‌లైన్: ప్రతిష్టాత్మక అంతర్జాతీయ జీవ వైవిధ్య సదస్సు (కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ (కాప్) -11) తొలిఘట్టం సోమవారం ఉదయం పది గంటలకు హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ (హెచ్‌ఐసీసీ)లో ప్రారంభం కానుంది. 193 సభ్యదేశాల ప్రతినిధులు పాల్గొనే ఈ సదస్సు ఈ నెల 19వ తేదీవరకూ జరగనుంది. ఇందులో తొలి అంకమైన ‘జీవ భద్రత’ సంబంధిత అంశాలపై 5 రోజుల పాటు చర్చించనున్నారు. ప్రపంచ వ్యాప్తంగా 150 దేశాల నుంచి రెండు వేల మంది ప్రతినిధులు హాజరయ్యే ఈ జీవ భద్రత సదస్సును రాష్ట్ర గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ ప్రారంభించనున్నారు. కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి జయంతీ నటరాజన్ ప్రారంభోపన్యాసం చేస్తారు. 2003 సెప్టెంబర్ 11 నుంచి అమల్లోకి వచ్చిన కార్టెజెనా ఒప్పందం, ఆ తదుపరి సదస్సుల్లో చేసిన తీర్మానాలు, అమలు పరిస్థితి, చేయాల్సిన మార్పులపై ప్రతినిధులు ప్రధానంగా చర్చిస్తారు. ఆధునిక జీవ సాంకేతిక పరిజ్ఞానం ద్వారా రూపుదిద్దుకున్న పంటలు, జీవజాతుల ద్వారా జీవ వైవిధ్యానికి రాగల ముప్పు నుంచి రక్షించుకునేందుకు కుదిరిన అంతర్జాతీయ ఒడంబడికనే కార్టెజెనా ఒప్పందంగా వ్యవహరిస్తున్నారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి