8, అక్టోబర్ 2012, సోమవారం

మీకు తెలుసా?

ప్రతి పేకముక్క నలుపు రంగు వైపున 365 చుక్కలు ఉంటాయి. ఈ చుక్కలు సంవత్సరానికి ఉండే 365 రోజులను గుర్తు చేస్తాయి

శ్రీధర్ కర్టూన్స్

                                                 

కేంద్రానికి వ్యతిరేకంగా మనకి మద్దతు ఇవ్వటనికి అన్ని పార్టిలు రేడి మెడం.. ప్రత్యేక ప్యాకెజి వచ్చాక ములాయం మద్దతునిస్తాట్ట. ఆస్తుల కేసు సెటిలయ్యక మయావతి వస్తారట. అవినితి కెసుల్నుంచి బయటపడ్డక డీఏంకె మనతో చెతులు కలుపుతుందంట.   

మణిపూర్‌లో బాంబు పేలుడు

NewsListandDetails
మణిపూర్‌లోని మోయిండంగ్ పాక్ ప్రాంతంలో బాంబు పేలుడు సంభవించింది. ఈ పేలుడులో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని పోలీసులు పేర్కొన్నట్లు సమాచారం.

7, అక్టోబర్ 2012, ఆదివారం

తులసీ తీర్థం ప్రబావితమైనదా ?

తులసీ తీర్థం ప్రబావితమైనదా ?

దేవాలయానికి వెళ్ళినప్పుడు అక్కడ మనం తీర్థాన్ని తీసుకుంటాం. తీర్థానికి తనకంటూ కొన్ని వైభవ గుణాలున్నాయి.హిందూ కుటుంబాలలో తులసి మొక్కను నాటి, పించి పోషిస్తారు. పవిత్ర జలాన్ని తులసి ఆకులతో జోడించడం ద్వారా ఆ జలం ఎంతో ప్రబావితమౌతుంది. ఆ జలం ఔషధ గుణాలను పొందుతుంది. విదేశాలలో ఓ విధమైన శుద్ద జలాన్ని ‘క్లిస్టర్డ్ వాటర్’ అని పిలుస్తారు. క్లిస్టర్డ్ వాటర్ లో ప్రమాదకరమైనటువంటి వ్యాపించి ఉన్న కాలుష్యం లేదని అమెరికాన్ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈ జలం ఎంతో శుద్దిచేయబడిన నట్టిదై మినిరల్స్ కలిగి వాడిన వారిని ఆరోగ్యవంతంగా మరియు జాగృతంగా ఉంచుతుంది. ఒక గ్లాసెడు మామూలు నీటిలో రెండు చుక్కల క్లిస్టర్డ్ వాటర్ కలిపినట్లయితే ఆ నీరంతా ఆరోగ్యప్రదమైన పానీయంగా మారుతుంది. తులసిని కలిపిన నీరు కూడా క్లస్టర్డ్ వాటర్ కలిపిన జలంలాంటి గుణం ఉందని కనుగొనడం జరిగింది. ఈ విషయమై ప్రఖ్యాతి గాంచిన శాస్త్రవేత్త డా. టి.పి. శశికుమార్ పరిశోధనలు జరిపాడు. దేవతా విగ్రహాన్ని కడగడానికి వాడే తులసి జలాన్ని సేకరించి ఈ జలంపై ప్రయోగాలు చేసాడు. పరిశోధన అనంతరం అతను తులసి జలానికి క్లస్టర్డ్ వాటర్ అన్ని గుణాలు ఉన్నాయని నిర్ధారించాడు. తులసి జలం త్రాగడానికి గుడికి వెళ్ళవలసిన అవసరం లేదు. దాన్ని ఇంటివద్దనే తయారు చేసుకోవచ్చు. మన ఋషులకు తులసీ జలం యెక్క గొప్పతనం తెలసుకాబట్టే దాన్ని వాడమని మనకు తెలిపారు.

చార్మీకి 12 లక్షలు

చార్మీకి 12 లక్షలు

త్వరలో విడుదల కానున్న ఢమరుకం సినిమాలో అందాల భామ చార్మీ ఒక ఐటెం సాంగ్ లో నటించింది. ఈ పాట తనకు మళ్లీ గుర్తింపు తీసుకొని వస్తుందని ఈ సెక్సీ భామ చాలా ధీమాగా ఉంది. కాగా, అందచందాలకు, అభినయానికి కొరత లేకపోయినా ఛార్మీకి సరైన బ్రేక్ ఇప్పటి వరకూ రాలేదు. ఇంకా చెప్పాలంటే రాను రాను అమెకు అవకాశాలు తగ్గుతున్నాయి. దీంతో చార్మి తన పారితోషకాన్ని బాగా తగ్గించుకుందట. గతంలో సినిమాకు లేదా ఐటెంసాంగ్ కు రూ. 25 లక్షల వరకూ తీసుకునే ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు 12 లక్షలతోనే సరిపెట్టుకుంటుందట. రేటు తగ్గించుకున్నా, చార్మికి చాన్సులు పెరుగుతాయని ఫిల్మ్ నగర్ లో ఎవ్వరూ అనుకోవడం లేదు. 

వివిధ అభిషేకాలు – వాటి పలితాలు

వివిధ అభిషేకాలు – వాటి పలితాలు ఒక్కొక్క వస్తువుతో చేసే అభిషేకానికి ఒక్కొక్క ఫలితం ఉంటుంది. వివిధ అభిషేకాలు, వాటివలన కలిగే ఫలితాలు ఇవీ.  1. ఆవుపాలు అభిషేకంతో సర్వసుఖాలను పొందవచ్చును.  2. ఆవు పెరుగుతో చేసే అభిషేకం వలన ఆరోగ్య మును, బలమును పొందవచ్చును. 3.ఆవునునెయ్యితో అభిషేకం వలన ఐశ్వర్యాభివృద్ది కలుగుతుంది. 4.పంచదారతో అభిషేకం చేస్తే సర్వ ధు:ఖ నాశనము జరుగుతుంది. 5.తేనెతో అభిషేకం చేస్తే వంశవృద్ది కలుగుతుంది. 6.పుష్పజలంతో అభిషేకం చేస్తే సిరిసంపదలు కలుగుతాయి. 7. పసుపుతో అభిషేకం చేస్తే మంగళకరం 8. కుంకుమజలంతో అభిషేకం చేస్తే చక్రవర్తిత్వం కలుగుతుంది. 9. భస్మజలంతో చేస్తే పాపాలన్నీ నశించిపోతాయి. 11. నువ్వులనూనె తో చేస్తే అపమృత్యుభయం తొలగి పోతుంది. 12. గంథజలంతో అభిషేకం చేస్తే పుత్రసంతానం కలుగుతుంది. 13. దూర్వజలంతో అభిషేకం చేస్తే పోయిన సొమ్ము తిరిగి లభిస్తుంది. 12. రుధ్రాక్షజలంతో అభిషేకిస్తే మహదైశ్వర్యము లభించును  14. సువర్ణజలంతో అభిషేకిస్తే దారిద్ర్యం నశించి పోతుంది. 16.రుద్రాక్షరసంతో అభిషేకిస్తే సర్వకార్యసిద్ధి కలుగుతోంది. 17. కస్తూరిజలంతో అభిషేకిస్తే సర్వాధికారం లభిస్తుంది. 18.నవరత్నజలంతో అభిషేకిస్తే ధన, ధాన్య, గృహప్రాప్తి కలుగుతుంది. 19.మామిడిరసంతో అభిషేకిస్తే దీర్ఘవ్యాధులన్నీ నివారణమౌతాయి. 20. విభూదితో అభిషేకిస్తే అష్టైశ్వర్యాలు మోక్షం కలుగు

దీపారాధనకి వినియోగించే వివిధ వత్తులు- వాటి ఫలితాలు

దీపారాధనకి వినియోగించే వివిధ వత్తులు- వాటి ఫలితాలు - ప్రత్తివత్తుల దీపారాధన:  దైవభక్తి వృద్ది అగును. పితృదేవతాదోషాలు తొలగును. -అరటినార వత్తుల దీపారాధన: కుటుంబశాంతి, మంచి సంతానం, కులదైవం అనుగ్రహం కలుగుతుంది. -తామరతూడు వత్తుల దీపారాధన:   ఋణబాధలు తొలగి, లక్ష్మీకటాక్షం కలుగుతుంది. సిరిసంపదలు కలిగి శ్రేయెస్సు కలుగుతుంది. -జిల్లేడు వత్తుల దీపారాధన : విఘ్ణేశ్వరుని అనుగ్రహం లభించి. దుష్టశక్తుల పీడ నివారణ మౌతుంది. సిరిసంపదలతో తులతూగుతారు. -పసుపు నీటితో తడిపిన క్రొత్త దిట్టవత్తుల దీపారాధన: అమ్మ కటాక్షం, జఠర, ఉదరసంబంధ వ్యాధుల నివారణ కలుగుతుంది. కామెర్లు త్వరగా తగ్గు ముఖం పడుతుంది.  -కుంకుమ నీటితో తడిపిన క్రొత్త బట్టవత్తులు దీపారాధన : దైవానుగ్రహం కల్గి వివాహ ఆలస్యసమస్యలు, వైవాహిక సమస్యలు, సంతానలేమి సమస్యలు ప్రయోగించబడిన మాంత్రిక శక్తులు తొలగిపోతాయి. మంచి సంతానం కల్గుతుంది.  -పన్నీరు అద్దిన వత్తులను నేతితో దీపారాధన-: లక్ష్మీదేవి అనుగ్రహం సిరిసంపదలు కీర్తి ప్రతిష్టలు కల్గుతాయి.

5, అక్టోబర్ 2012, శుక్రవారం

మనవాడు పొద్దున్నె...



“ఏమండీ ! ఇవాళ కొత్త సినిమా ఏదయినా రిలీజ్ అయిందా?” అడిగింది అన్నపూర్ణ.
“ఏం అయినట్టు లేదే, అయినా నీకెందుకొచ్చిందా అనుమానం?” అడిగాడు సుందరం. 
“ఎప్పుడూ లేనిది మనవాడు పొద్దున్నే లేచి స్నానం చేసి కాలేజీకి వెళుతున్నానని చెప్పి 
బయల్దేరితే అనుమానం వచ్చింది...” అంది అన్నపూర్ణ.

మల్లీ నీకే కాల్ చెసానా...


" డార్లింగ్ ఈ రోజు బాగా గుర్తుకోస్తున్నావురా! అందుకే ఉండలేక కాల్ చేస్తున్నా"
అని నర్సింగ్ తో ప్రేమగా అన్నది కీర్తి.
" ఇపుడే కదా డార్లింగ్ 45 నిమిషాలు మాట్లాడవు " అని సరదాగా అన్నాడు
నర్సింగ్.
" ఓహ్ షిట్...మళ్ళీ నీకే కాల్ చేశానా..." అని గబుక్కున నాలిక్కరుచుకుంది కీర్తి.
" ఆ..." అని ఆశ్చర్యంగా నోరు తెరిచాడు నర్సింగ్.

నేను కూడా మీతోపాటే


" కావేరి...బాక్స్ రెడీ అయిందా లేదా ?" ఆఫీసుకు బయలుదేరుతూ భార్య కావేరిని
అడిగాడు భర్త ఆనంద్.
" ఇంకా లేదండీ " అని లోపలి నుండే సమాధానం చెప్పింది భార్య కావేరి.
" సరే అయితే...నేను హోటల్ కెళ్ళి భోంచేసేస్తాను " అని ఆనంద్ బయలుదేరుతుంటే,
గబుక్కున బయటకు పరుగెత్తుకు వచ్చిన కావేరి " ఒక్క పదినిమిషాలు ఆగండి " అని
భర్త ఆనంద్ తో అంది.
" ఏం...? పది నిమిషాల్లో బాక్స్ రెడీ చేస్తావా "
"కాదు.... నేను కూడా తయారై మీతో పాటు హోటల్ కి వస్తాను " అని అంది కావేరి.
" ఆ..." అని ఆశ్చర్యంగా నోరు తెరిచాడు ఆనంద్.

వైఎస్ జగన్ బెయిల్‌ పిటీషన్‌ను



NewsListandDetails
 వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బెయిల్‌ పిటీషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. జస్టిస్‌ అఫ్తాబ్‌ ఆలం, జస్టిస్‌ రంజనా ప్రకాశ్‌ దేశాయ్‌తో కూడిన ధర్మాసనం ఈ తీర్పు వెలువరించింది. క్విడ్‌ప్రో కో కేసులో బెయిల్‌ కోసం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు బెయిల్‌ తోసిపుచ్చుతూ శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. జగన్ బెయిల్‌ పిటిషన్‌ సెప్టెంబర్‌ 14న ధర్మాసనం ముందుకు విచారణకు వచ్చింది. అయితే సీబీఐ కౌంటర్‌ పరిశీలించాల్సి ఉందంటూ జడ్జిలు విచారణను సెప్టెంబర్‌ 28కు వాయిదా వేశారు. ఈ కేసులో సీబీఐ రెండోసారి తన న్యాయవాదులను మార్చడంతో సీబీఐ విజ్ఞప్తి దృష్ట్యా కేసును అక్టోబర్‌ 5కు ధర్మాసనం వాయిదా వేసింది. సీబీఐ తరపున అడిషనల్‌ సొలిసిటర్‌ జనరల్‌ మోహన్‌ పరాశరన్‌, సీనియర్‌ న్యాయవాది అశోక్‌ బాన్‌ వాదించగా... జగన్‌ తరపున గోపాల్‌ సుబ్రహ్మణ్యం, విశ్వనాథన్‌ ధర్మాసనం ఎదుట హాజరయ్యారు. జగన్ ను అక్రమంగా అరెస్ట్ చేశారని, సీబీఐ ఈ కేసులో ఇప్పటివరకూ ఎలాంటి ఆధారాలు చూపలేదని న్యాయవాది గోపాల్ సుబ్రహ్మణ్యం వాదించారు. సాక్షులను తారుమారు చేస్తారంటూ బెయిల్ ను అడ్డుకోవటం సరికాదన్నారు. కాగా సీబీఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీ నారాయణ కూడా విచారణకు హాజరయ్యారు.



నకిలి PM


" నా పేరుతో నకిలీ యం పీ. నియోజకవర్గంలో తిరుగుతున్నాడు. అలాంటివాడిని
నమ్మకండి " అన్నాడు రంగనాథం సభచేసి.
" మేం నిన్నే నమ్మం. వాళ్ళని ఎలా నమ్ముతాం " అన్నారు జనం ఒక్కసారిగా
గొంతెత్తి.
" ఆ..." అని ఆశ్చర్యంగా నోరు తెరిచాడు రంగనాథం.

4, అక్టోబర్ 2012, గురువారం

వస్తున్నా.. మీకోసం పాదయాత్ర

NewsListandDetails
ప్రజల కష్టాలు తెలుసుకునేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వస్తున్నా.. మీకోసం పాదయాత్ర హిందుపురం నుంచి ప్రారంభించారు. చంద్రబాబు వెంట లోకేష్‌, భువనేశ్వరి కూడా పాల్గొన్నారు. తొలుత సూగూర్‌ ఆంజనేయస్వామి దేవాలయంలో చంద్రబాబు ప్రత్యేక పూజలు చేశారు. తొలిరోజు 8.7 కి.మీ. పాదయత్ర చేయనున్నారు. 13 జిల్లాల్లో 100 నియోజకవర్గాల్లో చంద్రబాబు పాదయాత్ర చేయనున్నారు. 2200 కి.మీ. పాదయాత్ర చేయనున్నారు. రోజుకు 15 నుంచి 18 కి.మీ చంద్రబాబు పాదయాత్ర చేస్తారు. పాదయాత్రను కర్నూలు, మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి, మెదక్‌, కరీంనగర్‌, వరంగల్‌, ఖమ్మం, కృష్ణా, పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో పాదయాత్ర చేపట్టనున్నారు. హిందుపురానికి భారీగా టీడీపీ కార్యకర్తలు తరలివచ్చారు. తెలుగు తమ్ముళ్లతో హిందుపురం వీధులన్నీ కిటకిటలాడాయి. సాంస్కృతిక నృత్యాలు ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. చంద్రబాబుది రాజకీయ యాత్ర కాదు, ప్రజాయాత్ర అని, పాదయాత్రకు మా పూర్తి సహకారం ఉంటుందని టీడీపీ నేతలు తెలిపారు. భారీకాన్వాయ్‌తో పసుపుదండు యాత్ర ప్రారంభమైంది.

30, సెప్టెంబర్ 2012, ఆదివారం

వివిధ ఉద్యోగ పరిక్షల తెదీల్లో మార్పులు

హైదరాబాద్, న్యూస్‌లైన్: వివిధ ఉద్యోగాల భర్తీకి నిర్వహించనున్న రాత పరీక్ష తేదీలను ఏపీపీఎస్సీ మార్పు చేసింది. ఎనిమిది కేటగిరీల పోస్టుల రాత పరీక్షల నిర్వహణకు నిర్ణయించిన కొత్త తేదీలను తమ వెబ్‌సైట్ (www.apspsc.gov.in)అందుబాటులో ఉంచింది. శనివారమే జరగాల్సిన జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టుల రాత పరీక్షలను అక్టోబర్ 3, 4 తేదీల్లో నిర్వహించాలని నిర్ణయించింది. ఆదివారం జరగాల్సిన టెక్నికల్ అసిస్టెంట్ (జియో ఫిజిక్స్) రాత పరీక్షలను 4వ తేదీకి మార్చి, ఆ రోజు జరగాల్సిన అసిస్టెంట్ డెరైక్టర్ ఇన్ మైన్స్ పరీక్షలను వాయిదా వేసింది. 

అక్టోబర్ ఒకటిన నిర్వహించాల్సిన గ్రౌండ్ వాటర్ విభాగం అసిస్టెంట్ హైడ్రాలజిస్ట్ పరీక్షను, ఇండియన్ ప్రివెంటివ్ మెడిసిన్ విభాగంలో శాంపిల్ టేకర్ రాత పరీక్షను అక్టోబర్ నాలుగున నిర్వహించనున్నట్లు పేర్కొంది. ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీలో జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు రాత పరీక్షను అక్టోబర్ 6, 7 తేదీల్లో నిర్వహించనుంది. అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టుల రాత పరీక్షలను అక్టోబర్ 28న, పబ్లిక్ హెల్త్ విభాగంలో అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టులకు, అకౌంట్స్ ఆఫీసర్, జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్, సీనియర్ అకౌంటెంట్, డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ సర్వే పోస్టుల రాత పరీక్షలను నవంబర్ 3, 4 తేదీల్లో నిర్వహించనున్నారు.

నేటి నుంచి జివవైవిద్య సదస్సు

హైదరాబాద్, న్యూస్‌లైన్: ప్రతిష్టాత్మక అంతర్జాతీయ జీవ వైవిధ్య సదస్సు (కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ (కాప్) -11) తొలిఘట్టం సోమవారం ఉదయం పది గంటలకు హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ (హెచ్‌ఐసీసీ)లో ప్రారంభం కానుంది. 193 సభ్యదేశాల ప్రతినిధులు పాల్గొనే ఈ సదస్సు ఈ నెల 19వ తేదీవరకూ జరగనుంది. ఇందులో తొలి అంకమైన ‘జీవ భద్రత’ సంబంధిత అంశాలపై 5 రోజుల పాటు చర్చించనున్నారు. ప్రపంచ వ్యాప్తంగా 150 దేశాల నుంచి రెండు వేల మంది ప్రతినిధులు హాజరయ్యే ఈ జీవ భద్రత సదస్సును రాష్ట్ర గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ ప్రారంభించనున్నారు. కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి జయంతీ నటరాజన్ ప్రారంభోపన్యాసం చేస్తారు. 2003 సెప్టెంబర్ 11 నుంచి అమల్లోకి వచ్చిన కార్టెజెనా ఒప్పందం, ఆ తదుపరి సదస్సుల్లో చేసిన తీర్మానాలు, అమలు పరిస్థితి, చేయాల్సిన మార్పులపై ప్రతినిధులు ప్రధానంగా చర్చిస్తారు. ఆధునిక జీవ సాంకేతిక పరిజ్ఞానం ద్వారా రూపుదిద్దుకున్న పంటలు, జీవజాతుల ద్వారా జీవ వైవిధ్యానికి రాగల ముప్పు నుంచి రక్షించుకునేందుకు కుదిరిన అంతర్జాతీయ ఒడంబడికనే కార్టెజెనా ఒప్పందంగా వ్యవహరిస్తున్నారు.

తిరుమలలో కొనసగూన్న రద్ది...


తిరుమల : తిరుమలలో సోమవారం భక్తుల రద్దీ కొనసాగుతోంది. స్వామివారి దర్శనం కోసం భక్తులు 31 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్నారు. వెంకన్న సర్వ దర్శనానికి 18 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి నాలుగు గంటల సమయం పడుతోంది. మహాలఘు దర్శనం అమలు అవుతోంది. వరుస సెలవులు కలిసి రావటంతో భక్తులతో తిరుమల కొండలు కిటకిటలాడుతున్నాయి.

నిమ్మ రసం పిండె కొత్త పరికరం




 








దీని కరీదు 250 రుపాయలు మత్రమె.



కవాతుపై ముగిసిన చర్చలు



తెలంగాణ జేఏసీ నేతలతో మంత్రులు సబిత, సారయ్య, జానారెడ్డి, ఉత్తమకుమార్‌ల చర్చలు ముగిసాయి. చర్చలకు సంబంధించి వివరాలను ముఖ్యమంత్రికి తెలిపేందుకు మంత్రులు సారయ్య, జానారెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డిలు బయటకు వచ్చారు.

అప్పారావుతో చిప్పరావు


అప్పారావుతో చిప్పరావు ఇలా అన్నాడు.
" మా యింట్లో ఉన్న అల్లారం మొట్ట మొదటిసారిగా నన్ను నిద్రలేపింది తెలుసా
మీకు " అని.
" అంత గట్టిగా అల్లారం కొట్టిందా......?" కొంచం ఆశ్చర్యంగా అడిగాడు అప్పారావు.
" కాదు కాదు...బల్ల మీద అల్లారాన్ని పిల్లి తోసేస్తే అదొచ్చి నా తలపై పడింది "
అని చెబుతూ పకపక నవ్వాడు చిప్పరావు.
" ఆ..." అని ఆశ్చర్యంగా నోరు తెరిచాడు అప్పారావు.

నువ్వు ఒకసారి




" ఏమండి .ఆ దూరంగా ఉన్నపచ్చ మేడ మీది కుర్రాళ్ళు నాకు రోజు సైట్
కొడుతున్నారండి." సిగ్గుపడుతూ భర్తతో చెప్పింది భార్య.
" అలాగా? నువ్వు ఒకసారి నేరుగా వాళ్ళ ఇంటికి వెళ్లి కనిపించు. వెధవలు
ఏకంగా  ఇల్లే ఖాళి చేసి పోతారు " అని పకపక నవ్వాడు ఆ భర్త.
అంతే ! భార్య మొహం నల్లగా మాడిపోయింది.

"టీచరుకిచ్చి పెళ్ళి చేసి నా గొంతు కోశారు"






"టీచరుకిచ్చి పెళ్ళి చేసి నా గొంతు కోశారు" అని తల్లి దగ్గర భోరుమంది కావేరి.
"ఏవైందమ్మా... నిన్నేమన్నా అన్నాడా?" కంగారు పడుతూ అడిగింది తల్లి.
"నిన్న వడ్డించిన కూరలో కాస్త ఉప్పు తక్కువైందని ఆ కూరను పదిసార్లు
వండమన్నాడు" అని చెప్పి మళ్ళీ భోరుమంది కావేరి.
" ఆ ..." అని ఆశ్చర్యంగా నోరు తెరిచింది తల్లి.

27, సెప్టెంబర్ 2012, గురువారం

సుఖ నిద్రకు మర్గాలు జోక్



" ఏరా కామేష్...నిన్న నీకు ఇచ్చిన సుఖ నిద్రకు మార్గాలు అనే పుస్తకం పూర్తిగా
చదివవా ?" అని కామేష్ ను అడిగాడు మన్మధుడు.
" రాత్రి చదువుదామనే పుస్తకం తెరిచానురా ! కాని ఈలోగా మత్తుగా
నిద్రముంచుకొచ్చింది. దాంతో చదవలేకపోయాను " అని చెప్పాడు కామేష్.
" ఆ..." అని ఆశ్చర్యంగా నోరు తెరిచాడు మన్మధుడు.

ఆప్పరావుతో చిప్పరావు జోక్


అప్పారావుతో చిప్పరావు ఇలా అన్నాడు.
" మా యింట్లో ఉన్న అల్లారం మొట్ట మొదటిసారిగా నన్ను నిద్రలేపింది తెలుసా
మీకు " అని.
" అంత గట్టిగా అల్లారం కొట్టిందా......?" కొంచం ఆశ్చర్యంగా అడిగాడు అప్పారావు.
" కాదు కాదు...బల్ల మీద అల్లారాన్ని పిల్లి తోసేస్తే అదొచ్చి నా తలపై పడింది "
అని చెబుతూ పకపక నవ్వాడు చిప్పరావు.
" ఆ..." అని ఆశ్చర్యంగా నోరు తెరిచాడు అప్పారావు.

"నువ్వు ఒకసార" జోక్



" ఏమండి .ఆ దూరంగా ఉన్నపచ్చ మేడ మీది కుర్రాళ్ళు నాకు రోజు సైట్
కొడుతున్నారండి." సిగ్గుపడుతూ భర్తతో చెప్పింది భార్య.
" అలాగా? నువ్వు ఒకసారి నేరుగా వాళ్ళ ఇంటికి వెళ్లి కనిపించు. వెధవలు
ఏకంగా  ఇల్లే ఖాళి చేసి పోతారు " అని పకపక నవ్వాడు ఆ భర్త.
అంతే ! భార్య మొహం నల్లగా మాడిపోయింది.

పదిసార్లు జోక్


"టీచరుకిచ్చి పెళ్ళి చేసి నా గొంతు కోశారు" అని తల్లి దగ్గర భోరుమంది కావేరి."ఏవైందమ్మా... నిన్నేమన్నా అన్నాడా?" కంగారు పడుతూ అడిగింది తల్లి."నిన్న వడ్డించిన కూరలో కాస్త ఉప్పు తక్కువైందని ఆ కూరను పదిసార్లువండమన్నాడు" అని చెప్పి మళ్ళీ భోరుమంది కావేరి." ఆ ..." అని ఆశ్చర్యంగా నోరు తెరిచింది తల్లి.

ఇంటికి వచ్చిన భర్త జోక్



ఆఫీసు పనితో విసిగిపోయి ఇంటికి వచ్చిన భర్త " నువ్వు ఇప్పుడు నాకు చెడు
వార్తలేవి చెప్పకు. మంచి వార్తలు ఉంటేనే చెప్పు " అన్నాడు భార్యతో.
" మన ముగ్గురమ్మాయిల్లో చిన్న వాళ్ళిద్దరూ ఎవరితోనూ లేచిపోలేదండి " అంది
భార్య నసుగుతూ.
" అంటే....పెద్దమ్మాయి....ఆ..." అని ఆశ్చర్యంగా నోరు తెరిచాడు ఆ భర్త.

యెడుకోండలవడు రాలేదు సార్ జోక్



" ఈ జటిలమైన కేసులో తీర్పు చెప్పాలంటే ఆ ఏడుకొండలవాడే దిగిరావాలి " అని
తనలో తను మాట్లాడుకుంటున్నట్టుగా అన్నాడు జడ్జిగారు.
ఆయన పక్కనే ఉన్న బంట్రోతు బయటకు పరుగెత్తుకువచ్చి " ఏడుకొండలూ,
ఏడుకొండలూ...." అని గట్టిగా అరిచాడు.
అరిచి అరిచి అలిసిన బంట్రోతు, ఎంతకు ఏడుకొండలూ రాకపోయేసరికి, మళ్ళీ
జడ్జి వద్దకు వచ్చి " ఏడుకొండలవాడు రాలేదు సార్ ! ఎంత పిలిచినా
జవాబులేదు " అన్నాడు వగరుస్తూ.
" ఆ..." అని ఆశ్చర్యంగా నోరు తెరిచాడు జడ్జిగారు.

"మర్యదస్తుల పిల్ల" జోక్



అదో చిన్న ఊరు. 
అప్పుడే ఆగిన రైల్లోంచి ఓ అందమైన అమ్మాయి లగేజితో దిగింది. అప్పటికి టైము రాత్రి
పదకొండు గంటలు దాటింది. ఆమె అక్కడే పడుకొని నిద్రపోతున్న ఓ రైల్వే పోర్టర్ ను
నిద్రలేపింది. 
“ ఈ ఊళ్ళో ఏదైనా మంచి హోటలుందా ?” అడిగిందామె పోర్టర్ ను. 
“ లేదండి " అన్నాడు నిద్రమత్తులో ఉన్న పోర్టర్. 
“ పోనీ ఏదైనా రెస్టారెంట్ ఉందా !” అడిగిందామె. 
“ లేదండి " నిద్రలోనే జోగుతూ జవాబిచ్చాడా పోర్టర్.
“ అరె ! నేనీ రాత్రి ఎక్కడ గడపాలి అయితే " ఆందోళనగా అందామె. 
“ మీకు అభ్యంతరం లేకపోతే మా స్టేషన్ మాస్టర్ తో కలిసి రూమ్ లో పడుకోండి.
ఏర్పాటు చేస్తాను " అన్నాడు ఆ పోర్టర్ హుషారుగా మత్తు వదల్చుకుని.
“ ఏమిటి నీ ఉద్దేశం ! నేను మర్యాదస్థుల యింటి ఆడపిల్లను తెలుసా ?” అందామె కోపంగా. 
“ మా స్టేషన్ మాస్టర్ కూడా మర్యాదస్థుల యింటి ఆడపిల్లెనండి " అన్నాడు పోర్టర్ తాపీగా.

ఆఫ్టర్ ఫైవ్ యేర్స్ జోక్



పోస్టల్ డిపార్ట్ మెంట్ లో పనిచేసే సుందరం, తన స్నేహితుడు శంకరం వద్దకు అప్పుకోసం
వచ్చాడు.
" శంకరం....నాకొక రెండొందలు అప్పు కావాలిరా ! నీవు రెండొందలు ఇస్తే వాటికి మరో
రెండొందలు వడ్డీ కలిపి మొత్తం నాలుగొందలతో నీ బాకీ తీరుస్తాను " అని అన్నాడు
సుందరం.
" నిజంగా....నాలుగొందలిస్తావా ? అయితే ఇప్పుడే రెండొందలు ఇస్తాను. మరి నాలుగు
వందలు ఎప్పుడు తిరిగి ఇస్తావు ?" అంటూ ఆశగా అడిగాడు శంకరం.
" అయిదు సంవత్సరాల తరువాత " అని నెమ్మదిగా చెప్పాడు సుందరం.
" ఆ..." అని ఆశ్చర్యంగా నోరు తెరుచాడు శంకరం.

ఆరుగురు ఆమ్మాయిలు కామెడి జోక్



" నీ జీవితంలోకి ఆరుగురు అమ్మాయిలు వస్తారు కాంతారావు '' అని కాంతారావు చేయి
చూస్తూ చెప్పాడు జ్యోతిష్యుడు.
దానికి సంబరపడుతూ, కాంతారావు "నిజమా! ఇదిగో వంద! ఎప్పుడు వస్తారు ?, ఎలా
వస్తారు ? '' అని మరింత మురిపెంగా ముందుకు చేయి చూపిస్తూ అడిగాడు.
వంద జేబులో పెట్టుకుంటూ "ఎలా ఏమిటి కాంతారావు...ఒక భార్య, ఐదుగురు కూతుళ్లూ "
అని చెప్పాడు జ్యోతిష్యుడు.
" ఆ..." అని ఆశ్చర్యంగా నోరు తెరిచాడు కాంతారావు.

"నా భార్యాను మాత్రం" జోక్





" హలో రామారావు గారేనా " అని ఫోన్ లో అడిగాడు సుందరం.
" ఔనండీ...మీరెవరు ?" అని అన్నాడు రామారావు.
" నా పేరు సుందరం... నేను నీ భార్యను కిడ్నాప్ చేశాను. రేపు సాయంత్రానికి మీరు
లక్ష రూపాయలు తీసుకుని ఊరిచివరికి వస్తే ఆమెను వదిలేస్తాను.లేదంటే చంపేస్తాను "
కోపంతో బెదిరించాడు సుందరం.
" బాబు..నీకు పుణ్యం ఉంటుంది...నీకు కావాల్సిన ఆ లక్ష రూపాయలు తీసుకొచ్చి
ఇస్తాను కాని దయచేసి నా భార్యను మాత్రం వదలొద్దు " అని వేడుకున్నాడు రామారావు.
" ఆ..." అని ఆశ్చర్యంగా నోరు తెరిచాడు సుందరం.

"పాములవాడు " జోక్



సినిమా రసవత్తరంగా నడుస్తోంది. 
ప్రేక్షకులంతా నిశ్శబ్దంగా గుడ్లప్పగించి చూస్తున్నారు. 
కాసేపటికే అందరిలో కలకలం. 
ఒక్కొక్కళ్ళూ అబ్బా, అయ్యా అనడం మొదలుపెట్టారు.
కుయ్యో, మొర్రో అంటూ కదుల్తున్నారు. 
మరి కాసేపటికి సినిమాను మించిన సౌండు మొదలైంది. కలవరం కాస్తా అలజడిగా మారింది.
“ఎహే, సినిమా ఆపండి, ఏంటీ ఎలుకల గోల? ఇదసలు సినిమా హాలా లేక ఎలుకల సొరంగమా?” అంటూ అరిచాడు ఒక పెద్ద మనిషి.
“ అవును...ఏమిటీ గోల? ముందుగా దీనిని ఆపండి.” అంటూ కోపంగా లేచాడు మరొక పెద్ద మనిషి.
“ మమ్మీ...” ఒక పిల్లాడు ఏడుస్తున్నాడు. 
“ నా చెవులు పగిలిపోతున్నాయి బాబోయ్ " అని ఆవిడ పెద్దగా అరుస్తూ,చెవులని మూసుకుంది.
ఇలా సినిమా చూస్తున్న వాళ్ళందరూ లేచి అరుపులు సాగించడంతో థియేటర్ మేనేజర్ రంగప్రవేశం చేశాడు.
“ఏంటండీ, ఇది సినిమా హాలేనా? ఈ వరసన ఎలుకలు దాడి చేస్తుంటే సినిమా ఎలా చూడాలి?”
“కాసేపు, ఓపిక పట్టండి, కబురు పంపించాను, అతనొచ్చేస్తాడు” 
“ఎవరు?” 
“పాములవాడు.. ఓ పది పాములు తెచ్చి పడేశాడంటే ఎలుకలన్నీ మాయమౌతాయి..”
" ఆఁ..” అంటూ అందరూ నోర్లు తెరిచారు.

"అమ్మ కోడితే" జోక్



telugu jokes

" ఎందుకురా ఏడుస్తున్నావు ?" అని బయట ఏడుస్తున్న తన కొడుకునుఅడిగాడు తండ్రి. " అమ్మ కొట్టింది డాడీ " అని ఏడుస్తూనే చెప్పాడు ఆ పిల్లాడు. " మీ అమ్మ నన్నుకొడితే నేనెప్పుడైనా నీలాగా ఏడ్చాన ?" అని కొడుకుతోఅన్నాడు తండ్రి." ఆ..." అని ఆశ్చర్యంగా నోరు తెరిచాడు ఆ పిల్లాడు.

'నీకోసం-నీప్రేమ కోసం' జొక్



" డార్లింగ్ నీ కోసం, నీ ప్రేమ కోసం నన్ను ఏమి చేయమంటే అది చేస్తాను. ఏదితెమ్మంటే అది తీసుకువస్తాను. చివరికి చావమన్నా చస్తాను " అని నిజాయితీగాఅన్నాడు ఆ ప్రేమికుడు." ఎప్పుడు చూడు చస్తానని అన్నావే గాని ఏనాడైనా ఆ ప్రయత్నం చేశావా "? అనిమూతి మూడు వంకర్లు తిప్పింది ఆ ప్రియురాలు." ఆ..." అని ఆశ్చర్యంగా నోరు తెరిచాడు ఆ ప్రేమికుడు.

హంపికి తొలి ఓటమి


అంకారా: ‘ఫిడే’ మహిళల గ్రాండ్‌ప్రి చెస్ టోర్నమెంట్‌లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపికి తొలి ఓటమి ఎదురైంది. అన్నా ముజిచుక్ (స్లొవేనియా)తో బుధవారం జరిగిన తొమ్మిదో రౌండ్‌లో తెల్లపావులతో ఆడిన హంపి 58 ఎత్తుల్లో ఓడిపోయింది.

ఈ విజయంతో అన్నా ముజిచుక్ ఏడు పాయింట్లతో అగ్రస్థానంలోకి దూసుకెళ్లింది. ఆరున్నర పాయింట్లతో హంపి రెండో స్థానానికి పడిపోయింది. మరో రెండు రౌండ్లు మిగిలి ఉన్న ఈ టోర్నీలో గురువారం జరిగే పదో రౌండ్‌లో కుబ్రా ఒజ్‌టుర్క్ (టర్కీ)తో హంపి తలపడుతుంది.
 

వినాయక నిమజ్జనంపై పోలీసుల ఆంక్షలు



NewsListandDetails
 వినాయక నిమజ్జనం రాష్ట్ర ప్రభుత్వాన్ని కలవరపెడుతోంది. తెలంగాణ మార్చ్‌ కంటే ఒకరోజు ముందే నిమజ్జన కార్యక్రమం ఉండడంతో... త్వరగా విగ్రహాలను తరలించాలని పోలీసులు కోరుతున్నారు.  29 అర్థరాత్రిలోపే నిమజ్జనం పూర్తి చేయాలని హుకుం జారీ చేస్తున్నారు. దీనిపై గణేష్‌ ఉత్సవ కమిటీ మండిపడుతోంది. హడావుడిగా శోభాయాత్రను ఎలా ముగించాలని ప్రశ్నిస్తోంది. అటు తెలంగాణ మార్చ్‌ను వాయిదా వేసుకోవాలని జేఏసీని కూడా ఉత్సవ కమిటీ కోరుతోంది.భక్తి, శ్రద్ధలతో సాగే భాగ్యనగర గణేష్‌ శోభాయాత్ర...ఈసారి గుబులు రేపుతోంది. 29న జరగనున్న నిమజ్జనంపై తెలంగాణ మార్చ్ తీవ్ర ప్రభావమే చూపే అవకాశం కనిపిస్తోంది. 30వ తేదీనే తెలంగాణ కవాతు ఉండడంతో... సాధ్యమైనంత త్వరగా నిమజ్జనం పూర్తి చేయాలని పోలీసులు కోరుతున్నారు. గణేష్ మండపాల నుంచి విగ్రహాలను ఉదయం 9 గంటల కల్లా నిమజ్జనానికి తరలించాలని ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఏదేమైనా 29వ తేదీ అర్ధరాత్రి లోపే నిమజ్జనం పూర్తి చేయాలని పోలీసులు పట్టుదలగా ఉన్నారు. ఈ మేరకు ట్యాంక్‌ బండ్‌ పరిసరాల్లో భారీ ఏర్పాట్లు చేశారు. పెద్ద పెద్ద క్రేన్లను సిద్ధం చేశారు. అటు భాగ్యనగర గణేష్‌ ఉత్సవ సమితి ఏర్పాటు చేసిన సమావేశానికి హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ అనురాగ్‌శర్మ హాజరయ్యారు. పోలీసుల వేదింపులను మండప నిర్వహాకులు సీపీ కి ఏకరువు  పెట్టారు. హడావుడి చేస్తే... నిమజ్జనం ఎలా పూర్తి చేయాలని ప్రశ్నించారు. దీనిపై స్పందించిన శర్మ, నిమజ్జనోత్సవం ప్రశాంతంగా జరిగేందుకు పోలీస్ శాఖ అన్ని ఏర్పాట్లు చేసిందని చెప్పారు. గణేష్ నిమజ్జనం ఉన్నందున తెలంగాణ మార్చ్ కు అనుమతి ఇవ్వలేదని స్పష్టం చేశారు.పోలీసుల హడావుడిపై భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి సభ్యులు గుర్రుగా ఉన్నారు. వేధింపుల మధ్య నిమజ్జనం ఎలా కొనసాగించాలని ప్రశ్నిస్తున్నారు. అటు టీ జేఏసీ తీరుపైనా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిమజ్జనం మర్నాడే తెలంగాణ మార్చ్‌ పెట్టుకోవడంపై మండిపడుతున్నారు. కవాతును వాయిదా వేయాలని కోరుతున్నారు.మొత్తానికి ప్రతి యేటా కన్నుల పండువగా సాగే గణేష్‌ శోభాయాత్ర ఈసారి ఎలా ముగుస్తుందోనన్న టెన్షన్‌ అందరిలోనూ కనిపిస్తోంది.



బీజేపీ నేత విద్యాసాగర్ రావు అరెస్టు



NewsListandDetails
భారతీయ జనతా పార్టీకి చెందిన ఎమ్మెల్యే విద్యాసాగర్ రావును కామారెడ్డి పోలీసులు గురువారం ఉదయం అరెస్ట్ చేశారు. గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిలను కలుసుకునేందుకు హైదరాబాద్‌కు వస్తున్న ఆయనను కామారెడ్డిలో అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. ఈ చర్యపై తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్యే టి.హరీష్ రావు మండిపడ్డారు. ఎమ్మెల్యేను అరెస్టు చేయడం దుర్మార్గమని, ఇవి ప్రభుత్వ రెచ్చగొట్టే చర్యలని హరీష్‌రావు విమర్శించారు. వెంటనే విద్యాసాగర్‌ రావును, తెలంగాణ వ్యాప్తంగా అరెస్టు చేసిన జేఏసీ నాయకులను విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. మరోవైపు.. ఈనెల 30వ తేదీన తెలంగాణ మార్చ్‌ను టీజేఏసీ నిర్వహిస్తుండటంతో ముందు జాగ్రత్తగా పలువురు తెలంగాణ నేతలను పోలీసులు అరెస్టు చేస్తున్నారు. అలాగే, భాగ్యనగరానికి వచ్చే అన్ని రహాదారుపై చెక్‌ పోస్టులను ఏర్పాటు చేసి ప్రతి వాహనాన్ని తనిఖీ చేస్తున్నారు. యువకులను ఎవరిని హైదరాబాద్ రానీయకుండా అడ్డుకుంటున్నారు. స్థానిక జేఏసీ నాయకులకు బైండోవర్ నోటీసులు జారీ చేశారు. నల్లగొండలో 75 మందిని, ఖమ్మంలో 85 మందిని, వరంగల్‌లో 80 మందిని, ఆదిలాబాద్‌లో 65 మందిని, నిజామాబాద్‌లో 90 మందిని, మెదక్‌లో 70 మందిని, కరీంనగర్‌లో 95 మందిని గురువారం అరెస్టు చేశారు.