వింతలు విశేశాలు వార్తలు
ప్రపంచంలో జరిగేవన్ని తెలియజెప్పె బ్లాగ్
7, అక్టోబర్ 2012, ఆదివారం
దీపారాధనకి వినియోగించే వివిధ వత్తులు- వాటి ఫలితాలు
ప్రత్తివత్తుల దీపారాధన: దైవభక్తి వృద్ది అగును. పితృదేవతాదోషాలు తొలగును. -అరటినార వత్తుల దీపారాధన: కుటుంబశాంతి, మంచి సంతానం, కులదైవం అనుగ్రహం కలుగుతుంది. -తామరతూడు వత్తుల దీపారాధన: ఋణబాధలు తొలగి, లక్ష్మీకటాక్షం కలుగుతుంది. సిరిసంపదలు కలిగి శ్రేయెస్సు కలుగుతుంది. -జిల్లేడు వత్తుల దీపారాధన : విఘ్ణేశ్వరుని అనుగ్రహం లభించి. దుష్టశక్తుల పీడ నివారణ మౌతుంది. సిరిసంపదలతో తులతూగుతారు. -పసుపు నీటితో తడిపిన క్రొత్త దిట్టవత్తుల దీపారాధన: అమ్మ కటాక్షం, జఠర, ఉదరసంబంధ వ్యాధుల నివారణ కలుగుతుంది. కామెర్లు త్వరగా తగ్గు ముఖం పడుతుంది. -కుంకుమ నీటితో తడిపిన క్రొత్త బట్టవత్తులు దీపారాధన : దైవానుగ్రహం కల్గి వివాహ ఆలస్యసమస్యలు, వైవాహిక సమస్యలు, సంతానలేమి సమస్యలు ప్రయోగించబడిన మాంత్రిక శక్తులు తొలగిపోతాయి. మంచి సంతానం కల్గుతుంది. -పన్నీరు అద్దిన వత్తులను నేతితో దీపారాధన-: లక్ష్మీదేవి అనుగ్రహం సిరిసంపదలు కీర్తి ప్రతిష్టలు కల్గుతాయి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి