8, అక్టోబర్ 2012, సోమవారం
మీకు తెలుసా?
ప్రతి పేకముక్క నలుపు రంగు వైపున 365 చుక్కలు ఉంటాయి. ఈ చుక్కలు సంవత్సరానికి ఉండే 365 రోజులను గుర్తు చేస్తాయి
శ్రీధర్ కర్టూన్స్

కేంద్రానికి వ్యతిరేకంగా మనకి మద్దతు ఇవ్వటనికి అన్ని పార్టిలు రేడి మెడం.. ప్రత్యేక ప్యాకెజి వచ్చాక ములాయం మద్దతునిస్తాట్ట. ఆస్తుల కేసు సెటిలయ్యక మయావతి వస్తారట. అవినితి కెసుల్నుంచి బయటపడ్డక డీఏంకె మనతో చెతులు కలుపుతుందంట.
మణిపూర్‌లో బాంబు పేలుడు
మణిపూర్‌లోని మోయిండంగ్ పాక్ ప్రాంతంలో బాంబు పేలుడు సంభవించింది. ఈ పేలుడులో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని పోలీసులు పేర్కొన్నట్లు సమాచారం.
7, అక్టోబర్ 2012, ఆదివారం
తులసీ తీర్థం ప్రబావితమైనదా ?

దేవాలయానికి వెళ్ళినప్పుడు అక్కడ మనం తీర్థాన్ని తీసుకుంటాం. తీర్థానికి తనకంటూ కొన్ని వైభవ గుణాలున్నాయి.హిందూ కుటుంబాలలో తులసి మొక్కను నాటి, పించి పోషిస్తారు. పవిత్ర జలాన్ని తులసి ఆకులతో జోడించడం ద్వారా ఆ జలం ఎంతో ప్రబావితమౌతుంది. ఆ జలం ఔషధ గుణాలను పొందుతుంది. విదేశాలలో ఓ విధమైన శుద్ద జలాన్ని ‘క్లిస్టర్డ్ వాటర్’ అని పిలుస్తారు. క్లిస్టర్డ్ వాటర్ లో ప్రమాదకరమైనటువంటి వ్యాపించి ఉన్న కాలుష్యం లేదని అమెరికాన్ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈ జలం ఎంతో శుద్దిచేయబడిన నట్టిదై మినిరల్స్ కలిగి వాడిన వారిని ఆరోగ్యవంతంగా మరియు జాగృతంగా ఉంచుతుంది. ఒక గ్లాసెడు మామూలు నీటిలో రెండు చుక్కల క్లిస్టర్డ్ వాటర్ కలిపినట్లయితే ఆ నీరంతా ఆరోగ్యప్రదమైన పానీయంగా మారుతుంది. తులసిని కలిపిన నీరు కూడా క్లస్టర్డ్ వాటర్ కలిపిన జలంలాంటి గుణం ఉందని కనుగొనడం జరిగింది. ఈ విషయమై ప్రఖ్యాతి గాంచిన శాస్త్రవేత్త డా. టి.పి. శశికుమార్ పరిశోధనలు జరిపాడు. దేవతా విగ్రహాన్ని కడగడానికి వాడే తులసి జలాన్ని సేకరించి ఈ జలంపై ప్రయోగాలు చేసాడు. పరిశోధన అనంతరం అతను తులసి జలానికి క్లస్టర్డ్ వాటర్ అన్ని గుణాలు ఉన్నాయని నిర్ధారించాడు. తులసి జలం త్రాగడానికి గుడికి వెళ్ళవలసిన అవసరం లేదు. దాన్ని ఇంటివద్దనే తయారు చేసుకోవచ్చు. మన ఋషులకు తులసీ జలం యెక్క గొప్పతనం తెలసుకాబట్టే దాన్ని వాడమని మనకు తెలిపారు.
చార్మీకి 12 లక్షలు

త్వరలో విడుదల కానున్న ఢమరుకం సినిమాలో అందాల భామ చార్మీ ఒక ఐటెం సాంగ్ లో నటించింది. ఈ పాట తనకు మళ్లీ గుర్తింపు తీసుకొని వస్తుందని ఈ సెక్సీ భామ చాలా ధీమాగా ఉంది. కాగా, అందచందాలకు, అభినయానికి కొరత లేకపోయినా ఛార్మీకి సరైన బ్రేక్ ఇప్పటి వరకూ రాలేదు. ఇంకా చెప్పాలంటే రాను రాను అమెకు అవకాశాలు తగ్గుతున్నాయి. దీంతో చార్మి తన పారితోషకాన్ని బాగా తగ్గించుకుందట. గతంలో సినిమాకు లేదా ఐటెంసాంగ్ కు రూ. 25 లక్షల వరకూ తీసుకునే ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు 12 లక్షలతోనే సరిపెట్టుకుంటుందట. రేటు తగ్గించుకున్నా, చార్మికి చాన్సులు పెరుగుతాయని ఫిల్మ్ నగర్ లో ఎవ్వరూ అనుకోవడం లేదు.
వివిధ అభిషేకాలు – వాటి పలితాలు

దీపారాధనకి వినియోగించే వివిధ వత్తులు- వాటి ఫలితాలు

5, అక్టోబర్ 2012, శుక్రవారం
మనవాడు పొద్దున్నె...
(4).png)
“ఏమండీ ! ఇవాళ కొత్త సినిమా ఏదయినా రిలీజ్ అయిందా?” అడిగింది అన్నపూర్ణ.
“ఏం అయినట్టు లేదే, అయినా నీకెందుకొచ్చిందా అనుమానం?” అడిగాడు సుందరం.
“ఎప్పుడూ లేనిది మనవాడు పొద్దున్నే లేచి స్నానం చేసి కాలేజీకి వెళుతున్నానని చెప్పి
బయల్దేరితే అనుమానం వచ్చింది...” అంది అన్నపూర్ణ.
మల్లీ నీకే కాల్ చెసానా...
.jpg)
" డార్లింగ్ ఈ రోజు బాగా గుర్తుకోస్తున్నావురా! అందుకే ఉండలేక కాల్ చేస్తున్నా"
అని నర్సింగ్ తో ప్రేమగా అన్నది కీర్తి.
" ఇపుడే కదా డార్లింగ్ 45 నిమిషాలు మాట్లాడవు " అని సరదాగా అన్నాడు
నర్సింగ్.
" ఓహ్ షిట్...మళ్ళీ నీకే కాల్ చేశానా..." అని గబుక్కున నాలిక్కరుచుకుంది కీర్తి.
" ఆ..." అని ఆశ్చర్యంగా నోరు తెరిచాడు నర్సింగ్.
నేను కూడా మీతోపాటే
.jpg)
" కావేరి...బాక్స్ రెడీ అయిందా లేదా ?" ఆఫీసుకు బయలుదేరుతూ భార్య కావేరిని
అడిగాడు భర్త ఆనంద్.
" ఇంకా లేదండీ " అని లోపలి నుండే సమాధానం చెప్పింది భార్య కావేరి.
" సరే అయితే...నేను హోటల్ కెళ్ళి భోంచేసేస్తాను " అని ఆనంద్ బయలుదేరుతుంటే,
గబుక్కున బయటకు పరుగెత్తుకు వచ్చిన కావేరి " ఒక్క పదినిమిషాలు ఆగండి " అని
భర్త ఆనంద్ తో అంది.
" ఏం...? పది నిమిషాల్లో బాక్స్ రెడీ చేస్తావా "
"కాదు.... నేను కూడా తయారై మీతో పాటు హోటల్ కి వస్తాను " అని అంది కావేరి.
" ఆ..." అని ఆశ్చర్యంగా నోరు తెరిచాడు ఆనంద్.
వైఎస్ జగన్ బెయిల్ పిటీషన్‌ను
వైఎస్ జగన్మోహన్రెడ్డి బెయిల్ పిటీషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. జస్టిస్ అఫ్తాబ్ ఆలం, జస్టిస్ రంజనా ప్రకాశ్ దేశాయ్‌తో కూడిన ధర్మాసనం ఈ తీర్పు వెలువరించింది. క్విడ్‌ప్రో కో కేసులో బెయిల్ కోసం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు బెయిల్ తోసిపుచ్చుతూ శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. జగన్ బెయిల్ పిటిషన్ సెప్టెంబర్ 14న ధర్మాసనం ముందుకు విచారణకు వచ్చింది. అయితే సీబీఐ కౌంటర్ పరిశీలించాల్సి ఉందంటూ జడ్జిలు విచారణను సెప్టెంబర్ 28కు వాయిదా వేశారు. ఈ కేసులో సీబీఐ రెండోసారి తన న్యాయవాదులను మార్చడంతో సీబీఐ విజ్ఞప్తి దృష్ట్యా కేసును అక్టోబర్ 5కు ధర్మాసనం వాయిదా వేసింది. సీబీఐ తరపున అడిషనల్ సొలిసిటర్ జనరల్ మోహన్ పరాశరన్, సీనియర్ న్యాయవాది అశోక్ బాన్ వాదించగా... జగన్ తరపున గోపాల్ సుబ్రహ్మణ్యం, విశ్వనాథన్ ధర్మాసనం ఎదుట హాజరయ్యారు. జగన్ ను అక్రమంగా అరెస్ట్ చేశారని, సీబీఐ ఈ కేసులో ఇప్పటివరకూ ఎలాంటి ఆధారాలు చూపలేదని న్యాయవాది గోపాల్ సుబ్రహ్మణ్యం వాదించారు. సాక్షులను తారుమారు చేస్తారంటూ బెయిల్ ను అడ్డుకోవటం సరికాదన్నారు. కాగా సీబీఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీ నారాయణ కూడా విచారణకు హాజరయ్యారు.
నకిలి PM
.png)
" నా పేరుతో నకిలీ యం పీ. నియోజకవర్గంలో తిరుగుతున్నాడు. అలాంటివాడిని
నమ్మకండి " అన్నాడు రంగనాథం సభచేసి.
" మేం నిన్నే నమ్మం. వాళ్ళని ఎలా నమ్ముతాం " అన్నారు జనం ఒక్కసారిగా
గొంతెత్తి.
" ఆ..." అని ఆశ్చర్యంగా నోరు తెరిచాడు రంగనాథం.
4, అక్టోబర్ 2012, గురువారం
వస్తున్నా.. మీకోసం పాదయాత్ర
ప్రజల కష్టాలు తెలుసుకునేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వస్తున్నా.. మీకోసం పాదయాత్ర హిందుపురం నుంచి ప్రారంభించారు. చంద్రబాబు వెంట లోకేష్, భువనేశ్వరి కూడా పాల్గొన్నారు. తొలుత సూగూర్ ఆంజనేయస్వామి దేవాలయంలో చంద్రబాబు ప్రత్యేక పూజలు చేశారు. తొలిరోజు 8.7 కి.మీ. పాదయత్ర చేయనున్నారు. 13 జిల్లాల్లో 100 నియోజకవర్గాల్లో చంద్రబాబు పాదయాత్ర చేయనున్నారు. 2200 కి.మీ. పాదయాత్ర చేయనున్నారు. రోజుకు 15 నుంచి 18 కి.మీ చంద్రబాబు పాదయాత్ర చేస్తారు. పాదయాత్రను కర్నూలు, మహబూబ్‌నగర్, రంగారెడ్డి, మెదక్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, కృష్ణా, పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో పాదయాత్ర చేపట్టనున్నారు. హిందుపురానికి భారీగా టీడీపీ కార్యకర్తలు తరలివచ్చారు. తెలుగు తమ్ముళ్లతో హిందుపురం వీధులన్నీ కిటకిటలాడాయి. సాంస్కృతిక నృత్యాలు ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. చంద్రబాబుది రాజకీయ యాత్ర కాదు, ప్రజాయాత్ర అని, పాదయాత్రకు మా పూర్తి సహకారం ఉంటుందని టీడీపీ నేతలు తెలిపారు. భారీకాన్వాయ్తో పసుపుదండు యాత్ర ప్రారంభమైంది.
1, అక్టోబర్ 2012, సోమవారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్‌లు (Atom)